ఆర్టీసీ బస్సులో కరోనా పేషంట్.. ఏపీలో టెన్షన్
లాక్‌డౌన్ నుంచి ఆర్టీసీ బస్సులకు మినహాయింపు ఇవ్వడం తెలిసిందే. ప్రజలకు శానిటైజర్లతో చేతులు కడిగిం, మాస్కులు పెట్టించి మరీ పకడ్బందీగా బస్సులు నడుపుతున్నారు. అయితే వేలమందిని పక్కగా తనిఖీ చేసే అవకాశం లేకపోవడంతో కరోనా ముప్పు మరింత పెరిగింది. ఏపీ ఆర్టీసీ బస్సులో ఓ కరోనా పేషంట్ ప్రయాణించడం కలకలం రేపుతోంది. అతన్ని ఆస్పత్రికి తరలించిన అధికారులు బస్సులో ప్రయాణించిన మిగతా వారి వివరాలు ఆరా తీస్తున్నారు.
విజయవాడకు చెందిన వ్యక్తి ఈ నెల 23న ఆర్టీసీ బస్సులో శ్రీకాకుళానికి వెళ్లాడు. నేరుగా బస్సు లేకపోవడంతో మధ్యలో రాజమండ్రి, విశాఖపట్నంలో బస్సులు మారాడు. శ్రీకాకుళం వెళ్లాక పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. పోలీసులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి, విశాఖపట్నంలో అతడు ఎక్కిన బస్సుల్లో ప్రయాణించివారి వివారాలు సేకరిస్తున్నారు. కరోనా సోకిన వారిలో చాలా మందికి ఆ వ్యాధి లక్షణాలు బయటకి కనిపంచడం లేదు. థర్మల్ టెస్ట్, శానిటైజర్, మాస్కులతో ఎన్ని తనిఖీలు, ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం లేకుండాపోతోంది. ఏపీలో ఇప్పటివరకు 3,300 కరోనా కేసులు, 60 మరణాలు సంభవించాయి.