కరోనా వైరస్‌కు మందులు, టీకాలు వస్తున్నాయన్న శుభవార్తల నడుమ షాకింగ్ విషయం బయటపడింది. వైరస్ నుంచి కోలుకున్నవారిలో యాండీబాడీలు అతివేగంగా బలహీనపడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. వైరస్‌ను అడ్డుకోవడంలో యాంటీబాడీలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి వేగంగా బలహీనపడ్డం వల్ల కరోనా మళ్లీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కరోనాతో ఇతర వైరస్, బ్యాక్టీరియా వ్యాధులు కూడాకబళిస్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా తీవ్రంగా సోకని 34 మంది పేషంట్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ పత్రికలో ప్రచురించిన వివరాల ప్రకారం.. కరోనా లక్షణాలు బయటపడ్డాక 37 రోజుల తర్వాత యాంటీబాడీలను పరీక్షించారు. 86 రోజుల తర్వాత మరోసారి విశ్లేషించారు. కరోనాను పోలిన సార్స్ వ్యాధి నుంచికోలుకున్న వారిలోని యాంటీబాడీల కంటే ఈ యాంటీబాలు వేగంగా దెబ్బతిన్నాయి. 90 రోజుల తర్వాత యాంటీబాడీలు ఎలా ఉంటాయన్న అంశాన్ని కూడా విశ్లేషించాల్సి ఉందని పరిశోధనలో పాల్గొన్న లాస్ ఏంజెలిస్ వర్సిటీలోని డేవిడ్ గెఫెన్ ఆఫ్ స్కూల్ మెడసిన్ ప్రొఫెసర్ జేవియర్ ఇబరాండో చెప్పారు. కరోనా నుంచి బయటపడిన వారిలో ఆరు నెలల వరకు రోగనిరోధక శక్తి ఉంటుందని స్వీడన్ పరిశోధకులు చెప్పిన నేపథ్యంలో తాజా అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది.