మంచిర్యాలలో ముంబై టెన్షన్..17 మంది వలస కూలీలకు కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

మంచిర్యాలలో ముంబై టెన్షన్..17 మంది వలస కూలీలకు కరోనా

May 18, 2020

Corona Patients Coming From Mumbai

తెలంగాణ గ్రామల్లో వలస కార్మికుల రాక కొత్త ఆందోళనకు కారణమౌతోంది. చాలా మంది వలస కూలీలు ముంబై నుంచి సొంత ఊళ్లకు చేరుకుంటుండటంతో చాలా మందికి వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. జగిత్యాల,ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది సొంత ఇళ్లకు వస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు భయపడిపోతున్నారు. 

ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా 7 మంది ముంబై నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ సంఖ్య 17కు చేరింది. వారందరిని బెల్లంపల్లి,తాళ్ల గురిజాల క్వారంటైన్ కు చెందిన వారిగా గుర్తించారు. వెంటనే వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. రోగులతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి హోం క్వారంటైన్ ఉండాలని సూచిస్తున్నారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 17 మంది ముంబై వలస కూలీలే ఉండటం విశేషం.