ఆదిలాబాద్‌లో కలకలం.. 10 మంది కరోనా రోగుల పరారీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆదిలాబాద్‌లో కలకలం.. 10 మంది కరోనా రోగుల పరారీ

August 2, 2020

Corona Patients Escape From RIMS Hospital.

10 మంది కరోనా రోగులు రిమ్స్ ఆస్పత్రి నుంచి పారిపోవడం ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. సదుపాయాలు సరిగా లేవని బాధితులు చికిత్స తీసుకుంటూనే ఎవరూ చూడక ముందు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. చాలా ఆలస్యంగా వైద్య సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి వెంటనే వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఒక్కసారిగా స్థానికుల్లో కలవరం మొదలైంది. వైరస్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారు సెక్యూరిటీ కళ్లు కప్పి తప్పించుకోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

పారిపోయిన వారిలో ఐదుగురు పురుషులు, ఐదుగురు స్త్రీలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మరో నలుగురు అనుమానిత లక్షణాలతో ఉన్నారు. పరారైన బాధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెళ్లిపోయిన వారు ఇప్పటి వరకూ ఎక్కడ ఉన్నారో తెలియకపోవడంతో వారు ఎవరెవరిని కలిశారోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తప్పుడు చిరునామాలు, తప్పుడు ఫోన్ నెంబర్లు ఇస్తూ కొంత మంది తప్పించుకుంటుండగా.. ఇలా నేరుగా ఆస్పత్రి నుంచే పరారు కావడం కలకలం రేపుతోంది.