కడప జిల్లాలో టెన్షన్.. క్వారంటైన్ నుంచి 15 మంది పరార్ - MicTv.in - Telugu News
mictv telugu

కడప జిల్లాలో టెన్షన్.. క్వారంటైన్ నుంచి 15 మంది పరార్

May 18, 2020

Corona patients escapes form quarantine center in kadapa district

లాక్‌డౌన్‌ మరో రెండు వారాలు పొడిగించడంతో ప్రజలే కాకుండా క్వారంటైన్ సెంటర్లలోని కరోనా అనుమానితులు కూడా తలపట్టుకుంటున్నారు. రోగులు పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎప్పుడెప్పుడు చికిత్స పూర్తవుతుందా, ఇళ్లకు వెళ్లిపోదామా అని ఎదురు చూస్తున్నారు. కొందరు అన్నిటికీ తెగించి బయటకి చెక్కేస్తున్నారు. కడప జిల్లాలో క్వారంటైన్ సెంటర్ నుంచి ఏకంగా 15 మంది చెప్పాపెట్టకుండా పారిపోయారు. అధికారులు లేని సమయంలో వీరు తప్పించుకున్నారు. ఈ విషయం బయటికి పొక్కడంతో చుట్టుపక్కల గ్రామాల జనం భయంతో వణికిపోతున్నారు. అధికారులు పూర్తి వివరాలు వెల్లడించడం లేదు. పారిపోయిన వారిలో కొందరు కరోనా అనుమానితులు, కొందరు కరోనా పాజిటివ్ రోగులు ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోపక్క కడప జిల్లాలోని నందలూరు మండలం ఆడపూరులో ఓ మృతదేహాన్ని ఖననం చేసే అంశంపై వివాదం కొనసాగుతోంది. పుష్పలత అనే మహిళ మహారాష్ట్రలోని పూణేలో కరోనాతో చనిపోయింది. మృతదేహాన్ని నందలూరుకు తీసుకొచ్చి చెయ్యేరు నది ఒడ్డున ఖననం చేయబోగా అడపూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెబుతున్నారు.