ఆస్పత్రిలో మంటలు.. ఐదుగురు కరోనా రోగులు మృతి
Editor | 12 May 2020 4:12 AM GMT
రష్యాలోని కోవిడ్ ఆస్పత్రిలో ఘోర అగ్రిప్రమాదం జరిగింది. సెయింట్ పీటర్స్ బర్గ్ హాస్పిటల్‌లో జరిగిన ఈ ఘటనలో 5 మంది కరోనా బాధితులు మరణించారు. మంగళ వారం ఉదయం జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. వెంటిలేటర్ నుంచి మంటలు వ్యాపించడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. కాగా గత శనివారం కూడా మాస్కోలోని ఓ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కరోనా రోగి మరణించిన సంగతి తెలిసిందే.
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో ఓవర్‌లోడ్ వల్ల వెంటిలేటర్ నుంచి మంటలు వచ్చాయి. కేవలం అరగంటలోనే ఇవి ఆస్పత్రిలో వ్యాపించడంతో వెంటిలేటర్‌పై ఉన్నవారు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో హాస్పిటల్ మొత్తం 150 మంది ఉండగా.. మిగితా వారిని సురక్షితంగా కాపాడగలిగారు. కాగా ఇప్పటికే రష్యాలో 2 లక్షల 21 వేలకు మందికి కరోనా సోకింది. మరణాల సంఖ్య 2 వేలు దాటిన సంగతి తెలిసిందే.
Updated : 12 May 2020 4:12 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire