ఇండోనేషియన్లను కలిసిన కరీంనగర్ వాసికి కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

ఇండోనేషియన్లను కలిసిన కరీంనగర్ వాసికి కరోనా

March 23, 2020

Indonesia

కరీంనగర్‌లో కరోనా పాజిటివ్ కేసు  కలవరం సృష్టిస్తోంది. ఇటీవల ఇండోనేషన్లు పర్యటించడం, వారికి కరోనా లక్షణాలు ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. వారిని కలిసిన వారికి ఈ వైరస్ సోకే అవకాశం ఉందని భావించి వారిని క్వారంటైన్ చేసి పరీక్షలు నిర్వహించారు. ఇందులో మరో ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. ఇండోనేషియన్లను కలిసిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లా వాసికి కరోనా సోకిందనే వార్తతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు. 

జిల్లాకు వచ్చిన మత ప్రచారకులతో కలిసి సంచరించిన ఆ వ్యక్తికి ఈ వ్యాధి సోకిందని కలెక్టర్ కె.శశాంక తెలిపారు. వెంటనే అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇండోనేషియన్లు దాదాపుగా 500 మందిని కలిసినట్టు గుర్తించించారు. దీంతో ప్రజలు ఎవరూ ఇతర వ్యక్తులను కలవకూడదని సూచించారు. స్థానిక వ్యక్తికి కరోనా వైరస్ సోకడం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు.