అండమాన్‌కూ  అంటించారు.. 10 కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

అండమాన్‌కూ  అంటించారు.. 10 కరోనా కేసులు

March 31, 2020

Corona Positive cases in Andaman .

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు కలకలం రేపుతున్నాయి. విదేశాల నుంచి కరోనాను తీసుకొచ్చిన వారికంటే ఆ ప్రార్థనల్లో పాల్గొన్న వారిద్వారానే ఎక్కువ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల తర్వాత ఈ సంఖ్య వేలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకపోవచ్చు. మర్కజ్  ప్రార్థనల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లిన వారికి వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వైరస్ ప్రధానంగా మర్కజ్‌కు వెళ్లిన వచ్చిన వారిలో ఎక్కువగా కనిపించింది. వీరిలో సోమవారం ఆరుగురు మరణించడం కలకలం రేపింది. ఏపీ, తెలంగాణల నుంచి 500 మందికిపైగా మర్కజ్ వెళ్లారు.

 తాజాగా ఈ వైరస్ అండమాన్‌కు కూడా ఈ వైరస్ పాకింది. ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని ఈ ప్రాంతంలో ఒక్కసారిగా 9 మందికి సోకినట్టు గుర్తించారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితోనే ఈ వైరస్ అండమాన్ చేరుకోవడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది.  వారంతా ఢిల్లీ నుంచి ఈ నెల 24న అండమాన్ చేరుకున్నట్టుగా గుర్తించారు. మత ప్రార్థనల కోసం నిజామూద్దీన్ వెళ్లి వచ్చినట్టుగా చెప్పారు. దీంతో వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించారు. వీరు ఇంకా ఏఏ ప్రాంతాల్లో పర్యటించారు. ఎవరెవర్నీ కలిశారో గుర్తించి వారిని కూడా ఐసోలేషన్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా నిజామూద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.