అచ్చెన్నాయుడికి కరోనా.. రమేష్ ఆస్పత్రిలోనే చికిత్స - MicTv.in - Telugu News
mictv telugu

అచ్చెన్నాయుడికి కరోనా.. రమేష్ ఆస్పత్రిలోనే చికిత్స

August 13, 2020

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అచ్చెన్నాయుడుకు కరోనా సోకింది. బుధవారం నుంచి ఆయనకు జలుబు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా గురువారం కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ఆయన గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై ప్రతి వారం ఆసుపత్రి హైకోర్టుకు బులెటిన్ అందజేస్తోంది. అచ్చెన్నకు కరోనా పాజిటివ్ అని హైకోర్టు ధృవీకరించింది. అచ్చెన్నకు పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కాగా, ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో జూన్ 12న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసులో ఇప్పటికే కొంత మంది అధికారులను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు.