బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో కలరోనా కలకలం సృష్టిచింది. తన ఇంట్లో పని చేసే చరణ్ సాహో (23)కు పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. అతన్ని ఐసోలేషణ్‌కు తరలించి వారంతా ముందస్తుగా పరీక్షలు చేయించుకున్నారు. అయితే వారెవరికి లక్షణాలు బయటపడలేదు. ఈ ఘటన బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
చరణ్ సోహో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళి అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అధికారులకు బోనీ కపూర్ సమాచారం ఇచ్చారు. బాధితున్ని అధికారులు ఐసోలేషన్ కోసం తరలించారు. దీంతో తామంతా బాగానే ఉన్నామని తెలిపారు. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి తమ కుటుంబ సభ్యులందరం ఇంట్లోనే ఉంటున్నాం అని అన్నారు. చరణ్ కూడా త్వరగా కోలుకోవాలని దేవుడని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు. తర్వలోని తను తిరిగి మా ఫ్యామిలీలో చేరిపోతాడంటూ ధీమా వ్యక్తం చేశారు.