Home > Featured > ఇండిగో విమానంలో కరోనా రోగి.. 129 మంది క్వారంటైన్

ఇండిగో విమానంలో కరోనా రోగి.. 129 మంది క్వారంటైన్

లాక్‌డౌన్ సడలింపుతో దేశీయంగా విమానా ప్రయాణాలు ప్రారంభం అయ్యాయి. థర్మల్ స్క్రీనింగ్ టెస్టుల తర్వాత ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. అయినా కూడా కరోనా పాజిటివ్ కేసులు కలవరం సృష్టిస్తున్నాయి. తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణం చేసిన ఓ వ్యక్తికి వైరస్ సోకినట్టు గుర్తించారు. దీంతో 129 మంది క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.

చెన్నై నుంచి కోయంబత్తూరుకు 129 మందితో ఇండిగో విమానం బయలుదేరింది. దీంట్లో చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో పని చేసే వ్యక్తి కూడా ప్రయాణం చేశాడు. అతనికి కోయంబత్తూర్ వెళ్లిన తర్వాత పరీక్షలు జరపగా.. కరోనా అని తేలింది. వెంటనే ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే అతనితో కలిసి ప్రయాణించిన వారందరికీ పరీక్షలు జరపగా.. నెగటివ్ వచ్చింది. ముందు జాగ్రత్తగా వారందరిని 14 రోజుల హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ప్రయాణికులు ఎవరూ రోగికి దగ్గరగా లేరని, అందరూ విధిగా మాస్కులు ధరించారని ఇండిగో ప్రకటించింది. విమానం మొత్తం శానిటైజ్ చేసినట్టు వెల్లడించింది.

Updated : 27 May 2020 1:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top