సీఎం పేషీలో కరోనా కలకలం.. ఐఏఎస్‌కు పాజిటివ్  - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం పేషీలో కరోనా కలకలం.. ఐఏఎస్‌కు పాజిటివ్ 

June 5, 2020

Corona Positive in Tamil Nadu CM Office

తమిళనాడులో కరోనా కల్లోలం ఆగడం లేదు. దాని తీవ్రత ఇప్పుడు అక్కడి సచివాలయంపైనా పడింది. తాజాగా ఓ ఐఏస్ అధికారిణితో పాటు చాలా మంది సెక్రటరేట్‌ ఉద్యోగులు వైరస్ బారిన డ్డారు. ఏకంగా సీఎం పేషీలోని అధికారికే కరోనా అని తేలడంతో ఒక్కసారిగా ఈ ఘటన కలకలం సృష్టించింది. వారందరిని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే సచివాలయంలో శానిటైజేషన్ చేశారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులను ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.  

సమాచార శాఖ, ప్రజాపనుల శాఖ, ఆర్థిక శాఖ, తమిళభాషాభివృద్ధి శాఖ సహా పలు శాఖల్లో పనిచేస్తున్న 30 మందికి పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్టు తేలింది. సీఎం పేషిలో పనిచేసే ఐఏఎస్ అధికారిణికి కూడా తాజాగా వైరస్ సోకింది. ఇటీవల ఒక వ్యక్తికి కరోనా సోకగా.. మిగిలిన వారిని పరీక్షించడంతో ఈ విషయం బయటపడింది. కాగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులను విడతల వారిగా పని చేయిస్తున్నారు. కేవలం 18 నుంచి 50 శాతం ఉద్యోగులు మాత్రమే ఆఫీసులకు వస్తున్నారు. అయినా కూడా వ్యాధి లక్షణాలు బయటపడటం అక్కడి ఉద్యోగులను తీవ్ర కలవరానికి గురి చేసింది.