ఇండోనేషియన్ల నిర్వాకం.. కరోనా ఉన్నా కరీంనగర్ వచ్చారు - MicTv.in - Telugu News
mictv telugu

ఇండోనేషియన్ల నిర్వాకం.. కరోనా ఉన్నా కరీంనగర్ వచ్చారు

March 26, 2020

Corona Positive Indonesians In Karimnagar  

కరీంనగర్‌లో కరోనా కలవరం సృష్టించిన ఇండోనేషియా మత బోధకుల వ్యవహారంలో మరో కోణం బయటపడింది. వీరిలో కొందరికి ముందుగానే కరోనా వ్యాధి సోకిందని తెలిసి కూడా భారత్‌కు వచ్చినట్టుగా నిర్ధారించారు. ప్రమాదకరమైన వైరస్ వెంటపెట్టుకొని నిర్భయంగా తిరుగుతూ తెలుగు ప్రజలకు ప్రాణాంతక వ్యాధిని అంటగట్టారు. నిజాన్ని దాచడంతో  పాటు వందలాది మందిని కలిసిన ఇండొనేషియా వాసుల చర్యపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా సీరియస్ గా ఉన్నాయి. 

మార్చి 10న ఇండోనేషియా నుంచి ఢిల్లీకి 10 మంది చేరుకున్న వీరిలో కొంత మందికి అప్పటికే కరోనా వైరస్ సోకింది. ఈ విషయం స్క్రీనింగ్ టెస్టులో బయటపడకుండా ఉండేందుకు ఒక్కొక్కరు నాలుగైదు పారసిటమల్ టాబ్లెట్లు వేసుకున్నారు. దీంతో వీరికి వైరస్ సోకిన విషయం బయటపడలేదు. మూడు రోజులు ఢిల్లీలోనే తిరుగుతూ.. 13న సంపర్క్ క్రాంతిఎక్స్ ప్రెస్ ఎక్కి రామగుండం వచ్చారు. ఆ తర్వాత కరీంనగర్‌లో వీరి విషయం తెలిసింది. వీరి కారణంగా దాదాపు 500 మంది క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు వీరు ప్రయాణించిన రైలు బోగిలో 82 మంది ఉండగా చాలా మంది గద్వాల, కర్నూలు, తిరుపతి తదితర ప్రాంతాల్లో దిగినట్టుగా పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాంతక వ్యాధిని వెంటబెట్టుకొని రావడంతో ఇప్పుడు కరీంనగర్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.