దొంగకు కరోనా.. ఆస్పత్రిలో చేర్చితే పారిపోయాడు - MicTv.in - Telugu News
mictv telugu

దొంగకు కరోనా.. ఆస్పత్రిలో చేర్చితే పారిపోయాడు

July 8, 2020

bbbhf

కరోనా సోకిన వారు ఐసోలేషన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చాలా మంది ఆ నిబంధనలను పాటించడం లేదు. ఇటీవల ఓ వ్యక్తి ఐసోలేషన్‌కు వెళ్లేందుకు ఇష్టం లేక పోలీసులతోనే ఫైటింగ్‌కు దిగాడు. తాాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ దొంగ కోవిడ్ ఆస్పత్రి నుంచి పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. 

దొంగతనం కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని గ్వాలియర్ జైలులో ఉంచారు. ముందు జాగ్రత్తగా అతనికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చింది. వెంటనే జైలు సిబ్బంది ఖైదీని ఆస్పత్రిలో చేర్పించారు. కాపలాగా ఇద్దరు పోలీసులను కూడా పెట్టారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆస్పత్రి నుంచి పారిపోయాడు. దీంతో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలే కరోనా రోగి కావడంతో అతడు ఎక్కడ తిరిగి ఎవరి అంటిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది.