తెలంగాణలో మూడేళ్ల బాలుడికి కరోనా.. 41కి చేరిన కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో మూడేళ్ల బాలుడికి కరోనా.. 41కి చేరిన కేసులు

March 26, 2020

Corona Positive to 3 Year Old Boy In Hyderabad

తెలంగాణలో కరోనా కలవరం సృష్టిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మూడేళ్ల బాలుడికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ బాలుడితో పాటు కుటుంబ సభ్యులందరిని క్వారంటైన్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని గోల్కొండలో తాజా కేసు నమోదు అయింది. దీంతో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 41కి చేరింది. 

బాధిత బాలుడి కుటుంబం ఇటీవల సౌదీ అరేబియా నుంచి వచ్చింది. ఆ వెంటనే అతనికి  జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అతనికి పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆ కుటుంబాన్ని క్వారంటైన్‌కు తరలించారు.  మరోవైపు రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల లండన్ నుంచి వచ్చాడు. అతనితో పాటు అతని భార్యకు కూడా ఈ వైరస్ సోకిందని వెల్లడైంది. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరూ బయట తిరగకూడదని సూచిస్తున్నారు.