భార్యకు కరోనా సోకిందని బైక్ తగలబెట్టాడు - MicTv.in - Telugu News
mictv telugu

భార్యకు కరోనా సోకిందని బైక్ తగలబెట్టాడు

May 21, 2020

hmgmhk

కరోనా రోగులపై వివక్ష చూపకూడదని ప్రభుత్వాలు చెబుతున్నా కొంత మందిలో మార్పు రావడం లేదు. సొంత కుటుంబ సభ్యులే బయపడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి తన భార్యకు కరోనా సోకిందని రెచ్చిపోయాడు. ఆమె బైక్‌ను తగలబెట్టి ఉన్మాదాన్ని ప్రదర్శించాడు. లంగర్ హౌజ్‌లోని బాపునగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతని తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రశాంత్ నగర్ లో నివసించే ఓ మహిళకు ఇటీవల కరోనా సోకింది. దీంతో ఆమెను అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త ఈ ఘటనపై ఉడికిపోయాడు. తన ఇంట్లో కరోనా సోకడం ఏంటని పిచ్చిగా ప్రవర్తించాడు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి పీకలదాక తాగొచ్చాడు. అదే మత్తులో ఇంటి సమీపంలోని రెండు బైకులు, ఒక ఆటోకు నిప్పుపెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కరోనా సోకిన భార్యకు ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన వ్యక్తి ఇలా పిచ్చిగా ప్రవర్తించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు.