ఏపీ మీద కరోనా వైరస్ కక్ష్యగట్టినంత పనే చేస్తోంది. మొన్నటివరకు కాస్త తగ్గుముఖం పట్టిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా ఒక్కరోజే 57 మందిని బలితీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన మరణాలతో ఏపీలో మొత్తం నమోదైన మరణాల సంఖ్య 5,663కి పెరిగింది. మృతిచెందినవారిలో ప్రకాశం జిల్లాలో 10 మంది, చిత్తూరులో 8, కడపలో 8, కృష్ణాలో 6, విశాఖపట్నంలో 5, తూర్పు గోదావరిలో 4, పశ్చిమ గోదావరిలో 4, గుంటూరులో 3, నెల్లూరులో 3, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 2, కర్నూలులో 1, విజయనగరంలో 1గా చనిపోయారు. మరోవైపు గడచిన 24 గంటల్లో 7,293 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,751కి పెరిగింది.
ఇక జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల్లో.. గోదావరి జిల్లాలో 1011, పశ్చిమ గోదావరి జిల్లాలో 922, అనంతపూర్లో 513, చిత్తూరులో 975, తూర్పు గుంటూరులో 393, కడపలో 537, కృష్ణ జిల్లాలో 450, ప్రకాశం జిల్లాలో 620, కర్నూలులో 206, నెల్లూరులో 466, శ్రీకాకుళంలో 306, విశాఖపట్నంలో 450, విజయనగరంలో 444 గా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 5,97,294 మంది ఇప్పటికే కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవగా.. 65,794 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.