చెబితే వినరుకదా.. ఒకే ఇంట్లో 25 మందికి కరోనా..  - MicTv.in - Telugu News
mictv telugu

చెబితే వినరుకదా.. ఒకే ఇంట్లో 25 మందికి కరోనా.. 

March 31, 2020

Corona pune family 

కరోనా వైరస్ కేసులు ఒక ఇంట్లో నాలుగైదు ఉండడం చూశాం. కేరళ, మహారాష్ట్ర, పుణే తదితర నగరాల్లో అవి వెలుగు చూశాయి. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఓ ఇంట్లో ఏకంగా 25 మందికి ఈ వైరస్ సోకింది. ఉమ్మడి కుటుంబానికి చెందిన వీరు ఇరుకిరుకు గదుల్లో నివసిస్తుండడంతో వ్యాధి పాకిపోయింది. 

కుటుంబానికి చెందిన నలుగురు కొన్ని రోజుల కిందటే సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చారు. రోగ లక్షణాలు కనిపించడంతో ఈ 23న పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. ఈ నెల 30 కల్లా మరో 21 మంది దాని బారినపడ్డారు. అధికారులు వెంటనే అప్రమత్తమై వారిని క్వారంటైన్ చేశారు. విదేశాల నుంచి వెళ్లొచ్చిన వారు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఐసొలేషన్‌లో ఉండాలని ప్రభుత్వాలు నెత్తీనోరూ కట్టుకుని చెబుతున్నా కొందరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాగా, దేశంలో ఈ రోజు సాయంత్రానికి కరోనా కేసులు సంఖ్య 1400 చేరింది. ఈ ఒక్కరోజే 230 కేసులు నమోదయ్యాయి. 

Corona pune family