భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులోనే - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులోనే

April 28, 2022

భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ వ్యాపించటం మొదలుపెట్టింది. క్రమ క్రమంగా రోజురోజుకు కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు మూడు వేలలోపు ఉన్న పాజిటివ్ కేసులు ఒక్కరోజులోనే 3,303కి పెరిగాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. ”గత 24 గంటల్లో దాదాపు 5 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించాం. అందులో 3,303 మందికి కరోనా నిర్ధారణ అయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.6 శాతానికి పెరిగింది. బుధవారం నమోదైన కేసుల్లో 1,367 కేసులు ఢిల్లీ నుంచి వచ్చాయి. యూపీ, హర్యానా, మిజోరాం, కేరళ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి” అని అధికారులు వివరాలను వెల్లడించారు.

మరోపక్క గడిచిన 24 గంటల్లో 2,563 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 39 మంది కరోనా కారణంగా చనిపోగా, కేరళలోనే 36 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 16,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 188 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 19.5 లక్షల మంది టీకా వేయించుకున్నారు.