జీహెచ్ఎంసీలో రాపిడ్ టెస్టులు.. అరగంటలోనే రిపోర్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

జీహెచ్ఎంసీలో రాపిడ్ టెస్టులు.. అరగంటలోనే రిపోర్ట్

July 9, 2020

Corona Rapid Tests GHMC

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో జనం వణికిపోతున్నారు. ఎవరికి వైరస్ ఉంది. ఎవరికి లేదో తెలియడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాపిడ్ టెస్టులను చేయాలని నిర్ణయించింది. దీని కోసం కొన్ని ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో 50, రంగారెడ్డి జిల్లాలో 20, మేడ్చల్‌లో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వీటిని నిర్వహిస్తున్నారు. 

ఈ పరీక్షల ద్వారా కేవలం అరగంటలోనే ఫలితం తెలుసుకోవచ్చుని అధికారులు చెబుతున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు వచ్చి పరీక్షలు చేసుకోవలని సూచించారు.ఈ విధానంలో తొలిసారి పాజిటివ్ ఫలితం వస్తే రెండోసారి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, నెగటివ్ వస్తే మాత్రం ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలాంటి పరీక్షలకు ప్రభుత్వం సిద్ధమౌతున్నట్టుగా తెలుస్తోంది. దీని కోసం రెండు లక్షల కిట్లను సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం