మే 21 కల్లా కరోనా ఖతం.. తాజా అధ్యయనంలో వెల్లడి
కరోనా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. దీని నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. పూట పూటకు విజృంభిస్తున్న ఈ మహమ్మారి అంతానికి శాస్త్రవేత్తలు కూడా శ్రమిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మే 21 నాటికి కరోనా కట్టడి అవుతుందని పేర్కొన్నారు. ముంబైకి చెందిన స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ(ఎస్ఈపీపీ) వెల్లడించింది.
ఈ వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతుందని ఈ అధ్యయన బృందం వెల్లడించింది. ఈనెల 7 నాటికి అన్ని రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఇలా క్రమంగా తగ్గుతూ.. మే 21కల్లా అదుపులోకి వస్తాయని అంచనా వేశారు. వైరస్ వృద్ధి క్రమంగా పెరుగుతూ.. గరిష్ట స్థాయికి చేరుకొని తగ్గుముఖం పడుతుందన్నారు. ది ఎండ్ ఈజ్ నియర్’ శీర్షికన ఎస్‌ఈపీపీ విడుదల చేసిన నివేదికలో దీన్ని ప్రస్తావించారు. ఈ అధ్యయనం ఎంత వరకు నిజం అవుతుందని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే లాక్‌డౌన్‌లో ఇచ్చిన మినహాయింపులు, వలస కార్మికుల తరలింపు ఇబ్బందిగా మారుతుందని అభిప్రాయపడ్డారు.