కరోనా లొల్లి.. పోలీసులపై కత్తిదూసిన ఆడబాబా..   - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా లొల్లి.. పోలీసులపై కత్తిదూసిన ఆడబాబా..  

March 25, 2020

nbnb

‘కరోనాతో మాకు ముప్పు లేదు. మేం దాన్ని తరమికొడతాం. మా పూజలకు, ప్రార్థనలకు అడ్డొస్తే ఖబడ్దార్..’ అంటూ ఓ ఆడ బాబా పోలీసులపై కత్తిదూసింది. లాక్‌డౌన్ పట్టించుకోకుండా వందలాది భక్తులతో పూజ మొదలెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో బుధవారం ఈ దారుణం జరిగింది.

తనను తాను ‘మా ఆదిశక్తి’గా చెప్పుకునే ఓ మహిళ నిర్వాకం ఇది. కానీ ఆమె కత్తికట్టే పోలీసులు లాఠీ పదునైంది కావడంతో అమ్మగారి పప్పులు ఉడకలేదు. పోలీసులు ఆ మతగుంపు చెదరగొట్టి, ఆమెను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లారు. గంపును చెదరగొట్టడానికి లాఠీచార్జీ కూడా చేశారు.