దూరంగా కూర్చో అన్నందుకు పొడిచి చంపాడు - MicTv.in - Telugu News
mictv telugu

దూరంగా కూర్చో అన్నందుకు పొడిచి చంపాడు

March 25, 2020

Tamilnadu

కరోనా వైరస్ దేశంలో కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను గుంపులుగా తిరగనివ్వడంలేదు. ఎవరూ ఇళ్లు దాటి బయటకు రాకుండా లాక్‌డౌన్ విధించారు. మనిషికి, మనిషికి మధ్య సామాజిక దూరం పాటించాలని కూడా సూచిస్తున్నారు. కానీ కొంత మంది వీటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ నిబంధనలు ఏ మాత్రం లెక్క చేయకుండా విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. కరోనా వచ్చే అవకాశం ఉందని.. దూరం పాటించమన్నందుకు ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చేశాడు. తమిళనాడులో ఈ  దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఊటీలో కూలీ పనులు చేసుకునే ప జోతిమణి(40) అనే వ్యక్తి ఓ హోటల్‌లో భోజనం చేస్తున్నాడు. అదే సమయంలో బేకరీలో పనిచేసే కేరళకు చెందిన దేవదాస్(43) టీ తాగేందుకు వచ్చాడు. జోతి మణి పక్కనే అతను కూర్చునే ప్రయత్నం చేయగా.. కరోనా కారణంగా సామాజిక దూరం పాటించాలని సూచించాడు. నన్నే పక్కకు వెళ్లమంటావా అని ఆగ్రహించిన దేవదాస్ గొడవకు దిగాడు. ఇది కాస్తా పెద్దది కావడంతో దేవదాస్ పక్కనే ఉన్న కత్తి తీసుకుని జోతిమణి మెడపై పొడిచాడు. అది లోతుగా దిగడంతో ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. దీంతో జోతిమణి కుటుంబంలో విషాదం నెలకొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంచి కోసం సామాజిక దూరం పాటించాలని చెప్పినందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.