Corona spread in India..16,906 new cases
mictv telugu

భారత్‌లో కరోనా వ్యాప్తి..కొత్తగా 16,906 కేసులు

July 13, 2022

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగాయి. నిన్న 14వేల లోపు వచ్చిన కొత్త కేసులు..నేడు 16,906కి చేరాయి. ఈ కొత్త కేసులకు సంబంధించిన బులెటెన్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు కాసేపటిక్రితమే విడుదల చేశారు.

”కొత్తగా 16,906 మందికి కరోనా సోకింది. మంగళవారం 4.59 లక్షల మంది కొవిడ్ పరీక్ష చేయించుకున్నారు. నిన్నంటి కంటే ఈరోజు 3వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 3. 88 శాతానికి చేరింది. ప్రస్తుతం వాటి సంఖ్య 1,32,457(0. 30 శాతం)కి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 15,447 మంది కోలుకున్నారు. 45 మంది మరణించారు. తాజాగా మృతుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో 4.36 కోట్ల మందికి కరోనా సోకగా, అందులో 98.49 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకూ 199 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేశాం” అని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.