సిగరేట్ పీల్చి కరోనాను పంచుకున్న ముగ్గురు ఫ్రెండ్స్.. - MicTv.in - Telugu News
mictv telugu

సిగరేట్ పీల్చి కరోనాను పంచుకున్న ముగ్గురు ఫ్రెండ్స్..

May 28, 2020

Corona Spread With Cigarette to Friends

కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. చేతులు కడిగిన తర్వాతనే ఏ వస్తువులైనా ముట్టుకోవాలని చెబుతున్నారు. అయినా కూడా వైద్యుల సూచనలు పాటించని ముగ్గురు ఫ్రెండ్స్ కరోనాకు గురయ్యారు. దర్జాగా ఒకే సిగరేట్ కాల్చి కరోనాను కొని తెచ్చుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో చోటు చేసుకుంది. 

షాద్ నగర్ కు చెందిన యువకుడికి కరోనా లక్షణాలు కనిపించాయి. అయినా కూడా దాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా హైదరాబాద్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి అంతక్రియలకు హాజరయ్యాడు. అక్కడే ముగ్గురు కలిసి సిగరెట్ షేర్ చేసుకున్నాడు. దీంతో ఇటీవల వారికి పరీక్షలు జరపగా ముగ్గురికి లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అందరిని ఐసోలేషన్‌కు తరలించారు .ఈ మూడు కేసులతో షాద్ నగర్ లో కరోనా సంఖ్య 7 కు చేరింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. యువకులు ఉన్న ప్రాంతాలను శానిటైజ్ చేసి వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,099 మందికి వైరస్ సోకింది.