గుంటూరులో కలకలం.. కరోనా అనుమానితుడు పరార్   - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరులో కలకలం.. కరోనా అనుమానితుడు పరార్  

March 27, 2020

Corona Suspect Escaped From Guntur Hospital  

కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాలా మందిలో మాత్రం మార్పు రావడం లేదు. అనుమానితులు, విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో క్వారంటైన్‌లో ఉన్న కరోనా అనుమానితుడు పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 25న అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా అనుమానించిన వైద్యులు జీజీహెచ్ వైద్యులు అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. ఈ సమయంలో అతడు వైద్య సిబ్బందికి తెలియకుండా పారిపోయాడు. కేస్ షీట్లను కూడా తనతో పాటు తీసుకెళ్లినట్టుగా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఇతర ఉద్యోగుల కళ్లుగప్పి సదరు వ్యక్తి ఎటో వెళ్లిపోయాడు. ఆర్ఎంవో ఆదినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితుడి కోసం గాలిస్తున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆందోళన చెందుతున్నారు.