తెలంగాణలో కరోనా ప్రతాపం.. నేడు 1,879 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా ప్రతాపం.. నేడు 1,879 కేసులు

July 7, 2020

1,879 Positive

కరోనా వైరస్ తెలంగాణలో తన ప్రతాపాన్ని నేడు కూడా ఏమాత్రం తగ్గించలేదు. రోజురోజుకు అది రెచ్చిపోతుంటే.. ఎక్కడ అది తమపై దాడి చేస్తోందని ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా నేడు తెలంగాణలో 1,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,422 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలవారిగా తీసుకుంటే.. రంగారెడ్డిలో 176, మేడ్చల్ 94, కరీంనగర్ 32, నల్గొండ 31, నిజామాబాద్ 19, వరంగల్ అర్బన్ 13, మెదక్ 12, ములుగు 12, మహబూబ్ నగర్ 11, సంగారెడ్డి 9, సూర్యాపేట్ 9, కామారెడ్డి 7, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల్ 4, ఖమ్మం 3, భద్రాద్రి కొత్తగూడెం 3, పెద్దపల్లి 3, జగిత్యాల 2, రాజన్న సిరిసిల్లా 2, నాగర్ కర్నూల్ 2, మహబూబా బాద్ 2, వికారాబాద్ 1, అదిలాబాద్ 1, జనగాం 1, వనపర్తి 1, సిద్దిపేట్ 1గా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 27,612కు పెరిగింది. కరోనా చికిత్స పొందుతూ నేడు 1,506 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 16,287కు చేరింది. నేడు ఏడుగురు కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 313కు పెరిగింది. కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో 11,012 మంది చికిత్స పొందుతున్నారు.