హైదరాబాద్‌లో ‘ప్రైవేట్’ కరోనా పరీక్షలకు బ్రేక్..  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో ‘ప్రైవేట్’ కరోనా పరీక్షలకు బ్రేక్.. 

July 2, 2020

Corona Test Stop In Private Labs At Hyderabad

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రతి రోజూ రాష్ట్రంలో అత్యధిక కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే వందల సంఖ్యలో వ్యాధిబారిన పడుతున్నారు. దీంతో నగరంలోని నగరంలోని పలు ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో 18 ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తున్నాయి. తాజాగా వీటిలో పరీక్షలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. నాలుగు రోజుల పాటు ఎలాంటి శాంపిల్స్ సేకరించడం లేదని స్పష్టం చేశారు. 

ఇటీవల నగరంలో కేంద్రం ఆరోగ్యశాఖ అధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ప్రైవేటు ల్యాబ్‌ల కరోనా పరీక్షల నిర్వహణపై సమీక్ష జరిపారు. వాటిలో కొన్ని లోపాలు ఉన్నట్టుగా బృందం గుర్తించింది. వెంటనే లోపాలు సవరించాలని ఆదేశించారు. 48 గంటల్లోగా తప్పులను సరి  చేసిన తర్వాత పరీక్షలు చేయాలని సూచించింది. దీంతో 5వ తేదీ వరకు శాంపిల్స్ సేకరించబోమని ప్రైవేటు లాబ్ యజమానులు ప్రకటించారు. ఈ సమయంలో తమ  సిబ్బందికి కరోనా శాంపిల్స్‌ సేకరించే విధానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.  ఈ క్రమంలో తాము స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈనెల 6 నుంచి తిరిగి యదావిధిగా పని చేస్తాయని తెలిపారు. కాగా గడిచిన 15 రోజులుగా ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే.