ఇంట్లోనే కరోనా పరీక్ష.. కిట్ రెడీ..  - MicTv.in - Telugu News
mictv telugu

ఇంట్లోనే కరోనా పరీక్ష.. కిట్ రెడీ.. 

March 26, 2020

Corona tets kits uk 

కరోనా వైరస్ సోకిందో లేదో తేల్చుకోవాలంటే ప్రస్తుతం ఆస్పత్రికి వెళ్లాల్సిందే. రక్తపరీక్ష ద్వారా లేబొరేటరీ సిబ్బంది వ్యాధినిర్ధారణ చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ వల్ల ఆస్పత్రులకు వెళ్లడం అంత సులభం కాదు. పైగా అందరూ ఆస్పత్రులకు వెళ్తే అక్కడా రద్దీ మొదలై అసలుకే మోసం వస్తుంది. అందుకే కాలు కదపకుండా ఇంట్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకోడానికి బ్రిటన్ శాస్త్రవేత్తలు హోం కిట్ రూపొందించారు. 

చిన్నపాటి ఈ పరికరంలో ఒక రక్తపు చుక్కను వేస్తే కరోనా పాటిజివో, నెగిటివో తెలుస్తుంది. ఇది వారం రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఇంగ్లండ్ నేషనల్ ఇన్ఫెక్షన్ సర్వీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ షరోన్ పీకాక్ తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే 35 లక్షల కిట్లను కొనుగోలు చేసింది. కరోనా టెస్ట్ కిట్లను చైనా, తైవాన్ లలోనూ రూపొందించారు. అయితే కచ్చితమైన ఫలితాల రావాలంటే లేబొరేటరీలే మంచిందని భావిస్తున్నారు. దీంతో కిట్లు మార్కెట్లోకి రావడం లేదు.