ఏపీలో టెన్షన్.. ఒక్కసారిగా 40కి.. దేశంలో 1350  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో టెన్షన్.. ఒక్కసారిగా 40కి.. దేశంలో 1350 

March 31, 2020

Corona toll in india and worldwide 

ఆంధ్రప్రదేశ్‌లో మందకొడిగా ఉన్న కరోనా కేసులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనల ఫలితంగా ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రార్థనల నుంచి తిరిగి వచ్చిన వారి ద్వారా లోకల్ ట్రాన్స్‌మిషన్ భారీ స్థాయిలో సాగినట్లు అనుమానిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన వారు ఇళ్లలో ఉండకుండా బయట తిరగడంతో వారి ద్వారా ఎంతమందికి వ్యాపించింతో లెక్కలు బయటికి రావడం లేదు. 

ప్రస్తుతానికి రాష్ట్రంలో మూడు మరణాలు, 40 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరేజో 17 కేసులు బయటపడ్డాయి. పక్షం రోజుల కిందట నిజాముద్దీన్ కు వెళ్లిన వారిలో ఇప్పుడు లక్షణాలకు కనిపిస్తున్నాయి. 147 శాంపిళ్లను పరీక్షించగా 17 కేసులు పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసులు జిల్లాలవారీగా ప్రకాశంలో 11, గుంటూరులో 9, విశాఖలో 6, కృష్ణాలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 2, నెల్లూరు, చిత్తూరు, కర్నూల్ జిల్లాలో ఒక్కొక్కటి ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఈ రోజు మధ్యాహ్నానికి 32 మరణాలు, 1350 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో నిన్న ఒక్కరోజే 20 వేల కేసులు రికార్డుగా, ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 38 వేలు దాటింది.