కరోనా అనుమానంతో ఆత్మహత్య.. దేశంలో 16 మరణాలు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా అనుమానంతో ఆత్మహత్య.. దేశంలో 16 మరణాలు

March 26, 2020

దేశంలో కరోనా కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ రోజు మధ్యాహ్నానానికి 646 కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కేసులు పెరుగుతున్నాయి. కశ్మీర్ లో ముగ్గురు, మహారాష్ట్రలో ఒకరు చనిపోవడంతో మరణాల సంఖ్య 16కు పెరిగింది.  తెలంగాణలో 44, ఏపీలో 10 కరోనా కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యప్తంగా మృతుల సంఖ్య 20 వేలు దాటగా, కేసులు సంఖ్య 4 లక్షలకు చేరింది. మనదేశంలో ప్రస్తుతానికి వందల్లో ఉన్న కేసుల సంఖ్య మరో నెల రోజులకల్లా లక్షలకు చేరుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలు బయటపడాలంటే 14 రోజులు గడవాలి కనుక ఇప్పటికే ఆ వైరస్ సోకిన వారి కొన్ని రోజుల్లోనే బయటపడతారని అంటున్నారు. 

మరోపక్క కరోనా సోకిందేమోనన్న అనుమానంతో కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కర్ణాటకలోని ఉడిపికి చెందిన 56 వ్యక్తి తనకు వైరస్ వచ్చిందన్న అనుమానంతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. తనకు కరోనా సోకినట్లు అతడు కుటుంబ సభ్యులతో చెప్పాడని, అయితే అందుకు ఆధారాలేవీ లేవని పోలీసులు చెప్పారు. అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేసిన పోలీసులు మృతడి లాలాజలాన్ని పరీక్షల కోసం లేబొరేటరీకి పంపారు.