దేశంలో కరోనా కాటుకు బలి అయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.ఇప్పటివరకు మన దేశంలో నిన్న ఒక్కరోజే 71 మంది మరణించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 32 మంది కన్నుమూశారు. దీంతో మరణాల సంఖ్య 1074కు చేరింది. దేశ వ్యాప్తంగా ఈ మహమ్మారి గురైన వారి సంఖ్య 33,050 గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో
కొత్తగా 1,813 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. దేశవ్యాప్తంగా కొత్తగా 8,325 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 23,651గా ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 9,915కి చేరింది.
మరణాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఇక్కడ 432 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. గుజరాత్ 181, మధ్యప్రదేశ్ 119, ఢిల్లీ 54 మంది చనిపోయారు.ఇప్పటి వరకు 7,796 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 24.56 శాతానికి పెరిగింది. మే 3వ తేదీతో దేశవ్యాప్త లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కేసుల సంఖ్య ఇంకా తగ్గక పోవడంతో పరిస్థితి అర్థం కాకుండా ఉంది. దీంతో పంజాబ్ ముఖ్యమంత్రి అమరిదర్ సింగ్ తమ రాష్ట్రంలో మే 17వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.