Corona upheaval in India.. Huge new cases
mictv telugu

భారత్‌లో కరోనా కల్లోలం..భారీగా కొత్త కేసులు

July 14, 2022

భారతదేశంలో మళ్లీ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. నిన్న మొన్నటివరకూ 18వేలలోపు నిర్ధారణ అయిన కొత్త కేసులు బుధవారం ఒక్కరోజే 20,139 కేసులు నమోదైయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. దేశవ్యాప్తంగా రేపటి నుంచి కరోనా బూస్టర్ డోస్‌ను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కొత్త కేసులకు సంబంధించిన తాజా బులెటెన్‌ను గురువారం విడుదల చేశారు.

విడుదల చేసిన బులెటెన్‌లో..” గడిచిన 24 గంటల్లో 20,139 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొన్నటితో పోలిస్తే మూడు వేల పైచిలుకు కొత్త కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో 32 మంది మృతి చెందగా, 16,482 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,36,076 క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటిదాకా కరోనా నుంచి 4,30,28,356 మంది కోలుకున్నారు. మొత్తంగా 5,25,557 మంది చనిపోయారు.”

ఇక, ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 5.10 శాతంగా, రికవరీ రేటు 98.49 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,99,27,27,559 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని, నిన్న ఒక్కరోజే కొత్తగా 13,44,714 డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.