యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనాను అంతం చేయాలనే పట్టుదలతో శాస్త్రవేత్తలు మందును కనుగొనే పనిలో పడ్డారు. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఎప్పుడు తిరిగేద్దామా.. అని జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే మరో సంచలన ప్రకటన శాస్త్రవేత్తల నుంచి వచ్చింది. ఒక వేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా దాని ప్రభావం కేవలం ఏడాది వరకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కొలంబియా మెయిల్‌మాన్ స్కూల్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యాయనంలో ఈ విషయం తేలింది.
ప్రస్తుతం ఓ మహమ్మారిగా మాత్రమే ఉన్న కరోనా వైరస్ భవిష్యత్తులో ఎండెమిక్‌గా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దాన్ని పూర్తిగా నిర్మూలించడం ఇప్పట్లో సాధ్యం కాదని అంటున్నారు. ఒకవేళ టీకా అందుబాటులోకి వచ్చినా కూడా మళ్లీమళ్లీ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. చెబుతున్నారు. కోలుకున్న తర్వాత వచ్చే రోగనిరోధకశక్తి ఏడాదిలోపే ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత తిరిగి సోకదని కొట్టిపారేయలేమని తేల్చారు. అయితే కొన్ని సంవత్సరాలు వ్యాధి పునరావృతమైన తర్వాత పూర్తిగా నిర్మూలించే వీలుంటుందని వివరించారు. ఇది వ్యాక్సిన్ లభ్యంత, దాని సమర్థత మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు.