కరోనా విలయ తాండవం..కొత్తగా 3వేల కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా విలయ తాండవం..కొత్తగా 3వేల కేసులు

April 27, 2022

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకుంటుంది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్న సమయంలో ప్రజలకు, వ్యాపారస్థులకు షాక్ ఇస్తుంది. నిన్న మొన్నటి వరకు వందలోపు ఉన్న కేసులు గడిచిన 24 గంటల్లో 3వేలకు పైగా కొత్త కేసులు నమోదైయ్యాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ”గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,927 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,65,496కు చేరాయి. ఇందులో 4,25,25,563 మంది బాధితులు కోలుకున్నారు. మరో 16,279 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 5,23,654 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు. కరోనా నుంచి 2,252 మంది కోలుకోగా, 32 మంది మృతి చెందారు” అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరోపక్క కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ త్వరలోనే కరోనా ఫోర్త్ వేవ్ రానుందని, అది జూన్ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, అక్టోబరు వరకు దాని ప్రభావం ఉంటుందని కాన్పూరు ఐఐటీ నిపుణులు అంచనా వేశారని అన్నారు.

కరనో విషయంలో నేడు ప్రధానమంత్రి మోదీ, అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్నారు. కరోనాను కట్టడి చేయడానికి ఇప్పటినుంచే ఏ చర్యలు తీసుకోవాలి? ఏ విధమైన ఆంక్షలు విధించాలని అనే దానిపై చర్చించనున్నారు.