మరో కొత్త వైరస్ వణికిస్తోంది.. బీ అలర్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

మరో కొత్త వైరస్ వణికిస్తోంది.. బీ అలర్ట్

January 17, 2020

ggjfhgb

నాగరిక ప్రపంచాన్ని కొత్త కొత్త వైరస్‌లు వణికిస్తూనే ఉన్నాయి. ఇంతకు ముందు వరకు స్వైన్ ఫ్లూ,నిపా, ఎబోలా,జికా వైరస్ భయపెట్టాయి. తాజాగా మరో వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో కరోనా అనే కొత్త వైరస్ లక్షణాలు కనిపించాయి. దీని కారణంగా ప్రాణాంతకమైన నిమోనియా సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త వైరస్ సోకుతుందని తెలిసి అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనలు జారీ చేసింది. తగిన చర్యలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది. 

వుహాన్‌ నగరంలో 41 మందిలో ఈ వైరస్ లక్షణాలు గుర్తించినట్టు వైద్యులు వెల్లడించారు. వీరిలో ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతున్నట్టుగా కనుగొన్నారు. జపాన్ నుంచి చైనా పర్యటనకు వచ్చిన ఓ 30 ఏళ్ల వ్యక్తికి కూడా ఈ వ్యాధి సోకింది. దీంతో ప్రపంచ దేశాలు తమ దేశంలోకి ఎక్కడ వ్యాపిస్తుందోనని అప్రమత్తం అయ్యాయి. థాయ్‌లాండ్‌లో కూడా ఓ యువతి ఈ వైరస్‌ బారినపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాలన్నింటిని అధికారులు అప్రమత్తం చేశారు. కొత్త వైరస్‌లు వస్తున్న ప్రతిసారి మందులు కనుగొంటున్నా  కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకు రావడం ఆందోళన కలిగిస్తోంది.