ఇలాంటి వాళ్లే అవసరం.. బుర్ఖా వేసుకుని మసీదు, గుడికి, గురుద్వారాకు
కరోనాపై పోరులో మతాలు, సంప్రదాయలను పక్కన పెట్టి చాలా మంది మానవత్వం చాటుకుంటున్నారు. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది ముఖ్యంగా వీటిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నార్త్ ఢిల్లీలో కూడా ఓ ముస్లిం మహిళ చేసిన పనికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు. గుడి,మసీదు, గుర్వాదారా అనే తేడా లేకుండా బుర్కా ధరించి శానిటైజర్ ట్యాంక్ భుజానికి వేసుకొని తన బాధ్యలను నిర్వహిస్తోంది. నవదుర్గా ఆలయంలో ఆమె శానిటైజ్ చేస్తుండగా.. తీసిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఇమ్రానా సైఫీ (32) అనే మహిళ మరో ముగ్గురు మహిళలు కలిసి కరోనా వారియర్స్ టీం గా రెడీ అయ్యారు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ.. శానిటైజేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో శానిటైజ్ చేస్తోంది. తాను బుర్కాలో వెళ్లినా కూడా గుడిలో, గురుద్వారాలో, మసీదులో ఎవరూ తనకు అడ్డు చెప్పలేదని పేర్కొన్నారు. మత సామరస్యాన్నికాపాడటానికే తాను ఇలా చేసినట్టు వెల్లడించారు. చాలా మంది మత గురువులు ఆలయాల్లోకి స్వాగతం పలికారని చెప్పారు. తాను మసీదు నుంచి వచ్చే అజాన్, గుడి నుంచి వినిపించే గంట శబ్దాలకు ఒకేలా స్పందిస్తామని అంటున్నారు. భారత్‌లో ఉన్న సెక్యూలర్ వ్యవస్థను కాపాడాలని అన్నారు. కాగా ఇమ్రానా భర్త నియామత్ అలీ ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. ఇమ్రానా కూడా ఏదో ఒక పని చేసు కుంటూ జీవిస్తోంది. కాగా లాక్‌డౌన్ సమయంలో ఖాళీ దొరకడంతో స్వచ్ఛందంగా సేవ చేస్తోంది.