స్థాయిని పెంచుకుంటోన్న కరోనా.. 8వ స్థానానికి భారత్ - MicTv.in - Telugu News
mictv telugu

స్థాయిని పెంచుకుంటోన్న కరోనా.. 8వ స్థానానికి భారత్

May 31, 2020

 

Bharat

కరోనా ప్రభావం అధికంగా ఉన్న టాప్ 10 దేశాల జాబితాలో భారత్ 8వ స్థానానికి చేరింది. నిన్నటివరకు 9వ స్థానంలో నిలిచిన భారత్.. నేడు మరో స్థానాన్ని అధిగమించింది. 1.85 లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదవడంతో భారత్ చైనాను కూడా ఎప్పుడో దాటేసింది. భారత్‌లో గంటకు దాదాపు 300కేసుల వరకు నమోదవుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే దేశంలో రికార్డు స్థాయిలో 8,380 కొత్త కరోనా కేసులు,193 మరణాలు నమోదయ్యాయి. 

దేశంలో ఒక్కరోజులో కరోనా కేసుల సంఖ్య 8వేలు దాటడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 5,266మంది మృతిచెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 61లక్షల 20వేలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌కు 3లక్షల 71వేల మందికి పైగా బలయ్యారు. 

 

జాబితాలో ఉన్న దేశాలు ఇలా..

  1. అమెరికా (18 లక్షలకు పైగా కేసులు నమోదు)
  2. బ్రెజిల్ (5 లక్షలకు పైగా కేసులు)
  3. రష్యా (4 లక్షల 5 వేలకు పైగా కేసులు)

4.స్పెయిన్ (2 లక్షల 86 వేల కేసులు)

  1. బ్రిటన్ (2 లక్షల 7 వేలకు పైగా కేసులు)
  2. ఇటలీ (2 లక్షల 32 వేలకు పైగా కేసులు)
  3. ఫ్రాన్స్ (1 లక్షా 88 వేలకు పైగా కేసులు)
  4. భారత్ (1 లక్షా 85 వేల కేసులు)
  5. జర్మనీ (1 లక్షా 83 వేలకు పైగా కేసులు)
  6. టర్కీ (1 లక్షా 63 వేలకు పైగా కేసులు)