మూతిగుడ్డ కట్టుకోని ఎంపీకి జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

మూతిగుడ్డ కట్టుకోని ఎంపీకి జరిమానా

June 5, 2020

Coronavirus Bhubaneswar BJP MP fined ₹300 for violating norms

అసలే కరోనా.. ఈ సమయంలో ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం కాదు, తాము కూడా జాగ్రత్తగా ఉండాలన్న విషయం మరిచిపోతున్నారు కొందరు బాధ్యతగల నేతలు. మరి అలాంటివారికి చట్టాలు అతీతం కాదు కదా. అందుకే ఆ ఎంపీకి నగర పోలీసులు జరిమానా విధించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి ముఖానికి మాస్క్ ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు మరో 20 మంది కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లగా వారంతా కరోనా లేనట్టే ఉన్నారు. దీంతో సదరు ఎంపీతో పాటు బీజేపీ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

అలాగే వారికి రూ.300 జరిమానా విధించామని భువనేశ్వర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ వెల్లడించారు. మాజీ అధికారిణి అయిన అపరాజిత భౌతిక దూరం పాటించకుండా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టడంతో.. అవి కాస్తా వైరల్ అయ్యాయి. దీంతో ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కరోనా నిబంధనలను గౌరవిస్తూ తాను స్వచ్ఛందంగా జరిమానా చెల్లించానని ఎంపీ అపరాజిత ట్వీట్ చేశారు. కాగా, భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించిన ఎంపీ అపరాజితపై ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.