కరోనా సోకొద్దంటే.. పార్సిళ్లను 72 గంటలు ముట్టుకోవద్దు.. - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా సోకొద్దంటే.. పార్సిళ్లను 72 గంటలు ముట్టుకోవద్దు..

May 11, 2020

Coronavirus: Brits urged to leave delivery parcels for 72 hours before opening

కరోనా వైరస్ వ్యాప్తి గురించి రోజుకొక కొత్త వార్త వినిపిస్తోంది. దాని వ్యాప్తి నుంచి తమను తాము రక్షించుకునే క్రమంలో కొందరు ఆన్‌లైన్ లావాదేవీలు, ఆన్‌‌లైన్ షాపింగ్‌ల మీద ఆధారపడ్డారు. అయితే ఇవి కూడా సురక్షితం కావని పరిశోధకులు బాంబులాంటి వార్త చెప్పారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్ వేదికల్లో తెప్పించుకునే పార్సిళ్లను 72 గంటల పాటు తెరవకుండా ఉండాలని బాత్, బిస్టల్, సౌతాంప్టన్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. స్వైన్‌ ఫ్లూ విజృంభించిన రోజుల్లో కూడా ఈ సూచనలను పాటించడం మంచి ఫలితాలను ఇచ్చిందని అంటున్నారు. ఈ సూచనను తప్పకుండా పాటించాల్సిందిగా ప్రజలకు బ్రిటీష్‌ ప్రభుత్వ వెబ్‌సైట్‌ పిలుపునిచ్చింది. వాస్తవానికి ఇది అన్ని దేశాల ప్రజలకు వర్తిస్తుందని చెప్పింది.

ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌పైన కరోనా వైరస్‌ 72 గంటలు ఉంటుందనిజజ.. రాగిపై ఎనిమిది గంటలు, కార్డ్‌బోర్డ్‌పై నాలుగు గంటలపాటు బతికి ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే కనుక్కోవడం తెలిసిన విషయమే. అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీలు ఎక్కువగా ప్యాకేజీల కోసం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నాయి. దీంతో పరిశోధకులు ఈ 72 గంటల సూచనను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.