న్యూస్ పేపర్,పాల ప్యాకెట్లపై కరోనా..ఎంతసేపు ఉంటుందో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

న్యూస్ పేపర్,పాల ప్యాకెట్లపై కరోనా..ఎంతసేపు ఉంటుందో తెలుసా?

March 24, 2020

Milk Packets

ఉదయం లేవగానే ప్రతి ఇంటిని తలుపుతట్టి లేపేది పేపర్, పాలప్యాకెట్లు. ఈ రెండింటితో ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం మొదలు అవుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తితో ఈ రెండు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. వైరస్ అంటకూడదని ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా వీటి ద్వారా ఆ మహమ్మారి మన ఇంట్లోకి చేరే అవకాశం ఉందని ఇటీవల వెల్లడైంది. ఇలా వచ్చిన వైరస్ వాటిపై ఎంతసేపు బతికి ఉంటుందనే విషయం చాలా కీలకంగా మారింది. దీనిపై యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, ప్రిన్స్‌టన్‌ వర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షన్‌ డిసీజెస్‌ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ వైరస్ సాధారణంగా గాల్లో అయితే కేవలం 3 గంటలు మాత్రమే బతికి ఉండే అవకాశం ఉందట. కానీ న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లపై మాత్రం సుమారు 9 గంటల పాటు మనుగడ సాగిస్తుంది. దీంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఈ రెండూ మార్గాలుగా ఉపయోగపడతాయని అంటున్నారు. ప్రజలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పాల ప్యాకెట్ ఇంటికి తీసుకురాగానే వెంటనే దాన్ని నీటితో శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ఈ విషయం తెలిసి ఇప్పటికే చాలా మంది పత్రికలు ఇంటికి రావడాన్ని నిలిపివేస్తున్నారు. కరోనా కారణంగా ఆ రంగంపై తీవ్ర ప్రభావం మాత్రం పడింది. 

ఇప్ప‌టికే న్యూస్ పేప‌ర్ సర్క్యులేషన్ గణనీయంగా ప‌డిపోయిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు దేశాలు న్యూస్ పేపర్స్‌ను కొంత కాలం నిషేధించాయి. ఇదే ఆలోచనలో భారత ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా సమాచారం. ఏప్రిల్ 1 తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం చర్యలు చేపట్టక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పత్రికలు ఫ్రింటింగ్ నిలిపివేశాయి.మరోవైపు వీటితో పాటు ప్యాకింగ్ అట్టపెట్టల్లో 24 గంటలు, చెక్క సామాగ్రిపై ఏకంగా 5 రోజుల పాటు కరోనా బతికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.