దేశంలో 90 వేలు దాటిన కరోనా కేసులు.. - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో 90 వేలు దాటిన కరోనా కేసులు..

May 17, 2020

mdrgh.kiewy

దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ రోజు రోజుకి వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏకంగా 4,987 కొత్త కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 90,927కు పెరిగింది. 

ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 2,872 మంది కరోనా బారిన పడి మరణించారు. మరోవైపు 34 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకోవడం కొంత ఊరటనిస్తోంది. దీంతో భారత్‌లో రికవరీ రేటు 37.51 శాతం వద్ద కొనసాగుతోంది. రాష్ట్రాలవారీగా చూస్తే 30,706 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలున్నాయి. దేశంలో నమోదైన కేసుల్లో మూడో వంతు ఒక్క మహారాష్ట్రలో నమోదు కావడం గమనార్హం.