3000 దాటేసిన భారత్.. మర్కజ్ ప్రార్థనలతో భారీగా కరోనా  - MicTv.in - Telugu News
mictv telugu

3000 దాటేసిన భారత్.. మర్కజ్ ప్రార్థనలతో భారీగా కరోనా 

April 4, 2020

Coronavirus Cases Cross 2,902 After Biggest Spike In 24 Hours: 10 Points

కరోనా ఏమాత్రం శాంతించడంలేదు. రోజురోజుకు కోరలు చాచుతూ విస్తరిస్తోంది. దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ ఆందోళన నెలకొంది. ఇందుకు ఢిల్లీ మర్కజ్ మసీద్ ప్రార్థనలు ఆజ్యం పోసినట్టే అయింది. మర్కజ్ ప్రార్థనల కారణంగా  దేశంలో కరోనా సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ ఉదయానికి 2902 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోని 601 కేసులు, 12 గంటల్లో 355 కేసుల నమోదు అయ్యాయని విచారం వ్యక్తంచేసింది. 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తలిసారి అని తెలిపింది. మధ్యాహ్నం తర్వాత వెల్లడించిన వివరాల ప్రకారం పాజిటివ్ కేసుల సంఖ్య 3,188కి పెరిగింది. 

అటు మృతుల సంఖ్య ఉదయం 68గా ఉండగా, ఇప్పుడా సంఖ్య 94కి చేరింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అలర్ట్ అయ్యాయి. భారత్‌లో ఇప్పుడు కీలకదశ నెలకొందని.. దాని వ్యాప్తిని అరికట్టేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని  అధికారులు యోచిస్తున్నారు. మర్కజ్ మసీద్ తబ్లీగ్ జమాత్‌కు హాజరైన వారికోసం అధికారవర్గాలు ఇప్పటికీ గాలిస్తున్నాయి. వారం రోజులుగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జమాత్‌కు హాజరైన వారే కావడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఆ సభ కారణంగా ఢిల్లీ, తమిళనాడులో అమాంతం కరోనా కేసులు పెరిగిపోయాయి. కాగా, దేశంలో మొత్తం 2,902 మందికి కరోనా వైరస్ సోకగా వారిలో 2,650 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇప్పటివరకు 183 మంది నయం అయ్యారు.