ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు..ఒక్కరోజే 30 - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు..ఒక్కరోజే 30

April 5, 2020

Coronavirus cases in andhra pradesh

ఏపీలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 194కు చేరింది. శనివారం ఒక్కరోజే 30 కేసులు నమోదైనట్టు, ఇద్దరు మరణించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ రెండుతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య మూడుకి చేరింది. కొత్తగా నమోదవుతోన్న కేసుల్లో ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారని తెలుస్తోంది. 

ప్రభుత్వం వెల్లడించిన బులిటెన్‌ ప్రకారం కృష్ణా జిల్లాలో 5, గుంటూరులో 3, ప్రకాశం, అనంతపూరం జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైందని తెలుస్తోంది. గుంటూరు, కడప, కృష్ణా, నెల్లూరు.. నాలుగు జిల్లాల్లోనే 113 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా నెల్లూరు, కృష్ణాలో 32 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు 30, కడప 23, ప్రకాశం 21, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో 15 చొప్పున, తూర్పుగోదావరిలో 11, చిత్తూరు 10, కర్నూలు 4, అనంతపురం 3లో కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్క కేసూ నమోదుకాలేదు.