ఏపీలో కొత్తగా 1,933 కేసులు..19 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో కొత్తగా 1,933 కేసులు..19 మంది మృతి

July 12, 2020

andhra pradesh

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకి సగటున 1500 కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,933 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్యా 29,168కి చేరింది. ప్రస్తుతం 13,428 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడి 15,412 మంది కోలుకున్నారు. 

అలాగే గడిచిన 24 గంటల్లో 19 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ర్ట వ్యాప్తంగా 328 కరోనా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో కర్నూల్, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.