దేశంలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

July 11, 2020

Coronavirus cases in India 

కరోనా మహమ్మారి దేశంలో కలకలం సృష్టిస్తోంది.‌ తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,82,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 27,114 పాజిటివ్‌ కేసులు నిర్ధారణయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 8,20,916కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో మొదటి 4 లక్షల కేసులు నమోదు కావడానికి 140 రోజుల సమయం పట్టగా.. తర్వాతి 4 లక్షల కేసులు కేవలం 20 రోజుల వ్యవధిలో నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 519 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 2,83,407 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతుండగా.. 5,15,385 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 22,123 కరోనా మరణాలు సంభవించాయి.