దేశంలో 9 లక్షలు దాటిన కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో 9 లక్షలు దాటిన కరోనా కేసులు

July 14, 2020

nvngdfj

దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. 8 లక్షల కేసులను దాటిన మూడు రోజుల వ్యవధిలోనే దేశంలో మరో లక్ష కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోన్న విషయం. సోమవారం ఒక్క రోజే 28,648 కొత్త కేసులు నమోదయ్యాయి. 

కొత్త కేసులతో కలిపితే దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 9,07,041కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో 538 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 23,695కి చేరింది. 9 లక్షల మంది కరోనా బాధితుల్లో ఇప్పటికే 5.7 లక్షల మందికిపైగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3.12 లక్షల మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు.