కరోనా అప్‌డేట్.. దేశంలో 6,48,315 పాజిటివ్ కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా అప్‌డేట్.. దేశంలో 6,48,315 పాజిటివ్ కేసులు

July 4, 2020

ngnv

భారత్‌లో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రష్యాతో పోటీ పడుతూ రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,771 మందికి కొత్తగా వైరస్ లక్షణాలు గుర్తించినట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 442 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో ఈ స్థాయిలో ఒకే రోజు ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి.

ఇప్పటి వరకు మొత్తం 6,48,315 మంది కరోనా బారిన పడ్డారు. మరణాల సంఖ్య18,655కు చేరింది. 3,94,227 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2,35,433 యాక్టివ్ కేసులు ఉన్నాయి.నిన్న ఒక్కరోజే 2,42,383 శాంపిళ్లను పరీక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా 11 మిలియన్ల మంది వ్యాధి బారిన పడ్డారు. 5,23000 మంది వైరస్ కాటుకు బలి అయ్యారు.