స్మార్ట్‌ఫోన్‌లపై కరోనా వైరస్ ఎఫెక్ట్..! - MicTv.in - Telugu News
mictv telugu

స్మార్ట్‌ఫోన్‌లపై కరోనా వైరస్ ఎఫెక్ట్..!

February 4, 2020

mnbjhv

కరోనా వైరస్ చైనా దేశంతో పాటు అనేక దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా చైనాలో దాదాపు 370 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 17000 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. దీంతో చైనా ప్రజలు వీధుల్లోకి రావాలంటే భయపడుతున్నారు. చైనాలో జనజీవనం స్తంభించింది. ఈ ప్రభావం వివిధ వ్యాపారాలపై కూడా కనిపిస్తోంది. చైనా నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయి. దీంతో చైనా నుంచి ఎగుమతయ్యే వివిధ వస్తువులు అనేక దేశాల్లో లభించడం లేదు.

అలా కరోనా వైరస్ కారణంగా తీవ్రప్రభావం ఎదురుకొంటున్న బ్రాండ్ల జాబితాలో అసుస్ ఒకటి. కరోనా వైరస్ కారణంగా ‘అసుస్ రోగ్ ఫోన్ 2’ అమ్మకాలకు ఇబ్బందులు ఎదురైనట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ప్రస్తుతం మనదేశంలో ఈ ఫోన్ అందుబాటులో లేదు. తిరిగి అందుబాటులోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టత రావడం లేదు. ప్రస్తుతానికి అసుస్ రోగ్ ఫోన్ 2 ఫ్లిప్ కార్ట్‌లో అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. తిరిగి సేల్‌కు ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని కూడా అసుస్ తెలపలేదు. అయితే ఈ కరోనా వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయిన బ్రాండ్లలో కేవలం అసుస్ మాత్రమే కాదు చాలా బ్రాండ్లు ఉన్నాయి. యాపిల్ కూడా చైనాలో తన కార్పొరేట్ ఆఫీస్‌లు, స్టోర్లు, కాంటాక్ట్ సెంటర్లను ఫిబ్రవరి 9వ తేదీ వరకు మూసివేసింది. శాంసన్ కూడా తన కొత్త ఫోన్‌ల లాంచ్ కార్యక్రమాలను వాయిదా వేసింది.