కరోనా పురుగుల కర్రీ రెడీ.. చూస్తే నోరూరాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పురుగుల కర్రీ రెడీ.. చూస్తే నోరూరాల్సిందే..

August 1, 2020

Coronavirus curry goes viral in social media

కరోనా వైరస్ వ్యాప్తితో నష్టం జరిగిదని ప్రజలు బాధపడుతుంటే కొన్ని రెస్టారెంట్లు మాత్రం దానిని కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. కరోనా వైరస్ ను పోలిన తినుబండరాలను తయారుచేసి అమ్మకానికి పెడుతున్నాయి. ఇటీవల ఓ బేకరీలో కరోనా వైరస్ ను పోలిన స్వీట్స్ ను అమ్మకానికి పెట్టిన సంగతి తెల్సిందే. తాజాగా రాజస్థాన్ జోధపూర్‌లో ఓ రెస్టారెంట్ కరోనా వైరస్ కర్రీలు తయారుచేస్తోంది. కరోనా వైరస్ ఆకారంలో కనిపించేలా కర్రీలను అమ్ముతోంది. 

 ఈ కొత్త రకం కర్రీలను తినడానికి ప్రజలు ఎగబడుతున్నారు. మలాయ్ కోఫ్తా కర్రీ లను ఈ విధంగా తయారు చేస్తున్నారు. ఈ కర్రీలలోని కోఫ్తాలను కరోనా వైరస్ ఆకారంలో చేస్తున్నారు. నాన్ రోటీలను కరోనా మాస్క్‌లా కనిపించేలా చేస్తున్నారు. తమ రెస్టారెంట్ లో వంటకాలను తయారు చేయడానికి అత్యంత పరిశుభ్రత, శానిటేషన్ చర్యలు తీసుకుంటున్నామనీ యాజమాన్యం తెలిపింది. తమ రెస్టారెంట్ లో సోషల్ డిస్టాన్సింగ్ తప్పనిసరిగా అమలుచేస్తున్నామన్నారు. ఈ కరోనా కర్రీ, నాన్ మాస్క్ వైరల్ కు సొసైల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.